Share News

కులదీప్‌పై హార్దిక్‌ ఆగ్రహం

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:59 AM

స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం పాక్‌ ఇన్నింగ్స్‌ 18వ...

కులదీప్‌పై హార్దిక్‌ ఆగ్రహం

కొలంబో: స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం పాక్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో షహీన్‌ క్యాచ్‌ను లాంగాన్‌లో బౌండరీ లైన్‌ దగ్గర కుల్దీప్‌ వదిలేయగా అది సిక్సర్‌గా వెళ్లింది. అంతకు ముందు బంతినే కీపర్‌ ఇషాన్‌ కూడా అందుకోలేకపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పాండ్యా ఇద్దరినీ చూస్తూ కోపంగా ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఇక మ్యాచ్‌ ముగిశాక జట్టు ఆటగాళ్లు కరచాలనం చేసుకున్న సమయంలోనూ కుల్దీప్‌తో హార్దిక్‌ సీరియ్‌సగా మాట్లాడగా, కెప్టెన్‌ సూర్య సైతం అతడిపై సీరియస్‌ అయ్యాడు. అయితే కుల్దీప్‌ మాత్రం జవాబివ్వకుండా ముందుకు సాగాడు.

ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 17 , 2026 | 04:59 AM