పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్!
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:01 AM
టీ20 ప్రపంచక్‌పలో ఆదివారం పాకిస్థాన్‌తో పోరులో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన భారత వికెట్‌కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తోంది...
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచక్‌పలో ఆదివారం పాకిస్థాన్‌తో పోరులో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన భారత వికెట్‌కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిశాక తన ప్రియురాలు అదితి హుందియాను ఇషాన్ మనువాడే అవకాశముందని అతని తాత అనురాగ్ పాండే పరోక్షంగా వెల్లడించారు. ‘ఇషాన్ ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఇందులో మాకెలాంటి అభ్యంతరం లేదు. అతని పెద్దన్నయ్య పెళ్లి కూడా ఇలాగే జరిగింది. జైపూర్‌కు చెందిన అదితి అనే మోడల్‌తో మావాడు రిలేషన్‌షి్‌పలో ఉన్నాడు’ అని అనురాగ్ తెలిపారు. 27 ఏళ్ల ఇషాన్, 29 ఏళ్ల అదితి 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అదితి 2018 ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్.
ఇవి కూడా చదవండి:
ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్