Share News

తనూజ, మిన్ను అదిరె..

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:57 AM

మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భారత్‌-ఎ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లి టైటిల్‌కు చేరువైంది. గ్రూప్‌-ఎలో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో...

తనూజ, మిన్ను అదిరె..

మనమ్మాయిలు సెమీస్‌ చేరె

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ

బ్యాంకాక్‌: మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భారత్‌-ఎ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లి టైటిల్‌కు చేరువైంది. గ్రూప్‌-ఎలో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో బౌలర్లు తనూజా కన్వర్‌ (4/12), మిన్ను మణి (3/8), రాధా యాదవ్‌ (2/17) చెలరేగడంతో యువ భారత్‌ ఏడు వికెట్లతో నేపాల్‌ను ఓడించింది. మొదట నేపాల్‌ భారత బౌ లింగ్‌ ధాటికి 18 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ సంజానా ఖడ్కా (22) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో ఓపెనర్‌ దినేశ్‌ వ్రింద (18 బంతుల్లో 9 ఫోర్లతో 39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో యువ భారత్‌ 7.5 ఓవర్లలోనే 82/3 స్కోరు చేసి గెలిచింది. తేజల్‌ 18 రన్స్‌ చేసింది. ఇదే గ్రూప్‌-ఎలో పాకిస్థాన్‌-ఎ జట్టు 9 వికెట్లతో యూఏఈని ఓడించి సెమీస్‌ చేరింది. భారత్‌, పాక్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌ బెర్త్‌ దక్కించుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 02:57 AM