Share News

షమీకి 8 వికెట్లు

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:58 AM

బెంగాల్‌ వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (8/90) అద్భుత బౌలింగ్‌తో రాణించినా.. జమ్మూ కశ్మీర్‌ విజయం అంచున నిలిచింది. 126 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన జమ్మూ జట్టు తమ...

షమీకి 8 వికెట్లు

  • జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ 302

  • బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌ 99 ఆలౌట్‌

  • రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌

కళ్యాణి: బెంగాల్‌ వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (8/90) అద్భుత బౌలింగ్‌తో రాణించినా.. జమ్మూ కశ్మీర్‌ విజయం అంచున నిలిచింది. 126 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన జమ్మూ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 43/2 స్కోరుతో నిలిచింది. ఇక బుధవారం మరో 83 పరుగులు సాధిస్తే ఆ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. మూడో రోజు 198/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కశ్మీర్‌ను షమి దెబ్బతీశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. సునీల్‌, అకీబ్‌లకు నాలుగేసి వికెట్లు దక్కాయి. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు చేసింది. మరో సెమీ్‌సలో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 736 పరుగులకు ఆలౌటైంది. స్మరణ్‌ (135), కృతిక్‌ (60), విద్యాధర్‌ (54) రాణించారు. ఆదిత్యకు 4, మయాంక్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 149/5 స్కోరుతో ఉంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 02:58 AM