Home » Cricket news
కత్తితో గొంతు కోసుకొన్న దంపతుల ఘటనలో కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్యాభర్తలు రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ గొంతుకోసుకున్న మాట వాస్తవమేనని, ఈ ఘటనలో భర్త మాత్రమే మృతిచెందగా, భార్య స్వల్ప గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాదానికి గాయం అయిన సంగతి తెలిసిందే. గాయంతోనే బ్యాటింగ్‌కు దిగి అర్ధశతకం సాధించాడు. అనంతరం టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అప్పట్నుంచి ఇంటికే పరిమతమయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో టీ-20 లీగ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. టీ-20 క్రికెట్ అంటేనే ఎన్నో వింతలకు నెలవు. తాజాగా ఈ టోర్నీలో ఓ బ్యాటర్ అవుట్ అయిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
హర్భజన్ సింగ్, శ్రీశాంత్ వివాదానికి సంబంధించి కాంట్రవర్షియల్ వీడియో విడుదల చేయడాన్ని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజం చెప్పిన తనపై అంత కోపం ఎందుకని శ్రీశాంత్ భార్యను ప్రశ్నించారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని ఆర్ఆర్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. నిజానికి వచ్చే సీజన్‌కు కూడా ఆర్ఆర్ జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాల్సి ఉంది.
ఎంఎస్ ధోనీ.. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన గొప్ప కెప్టెన్. ధోనీ సారథ్యంలో టీమిండియా రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఇక, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన వీడియోను మళ్లీ రిలీజ్ చేసినందుకు లలిత్ మోదీ, మైఖ్లార్క్పై శ్రీశాంత్ భార్య ఫైరైపోయారు. ఇది అమానవీయం, కర్కశం అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
2008 నాటి ఐపీఎల్లో శ్రీశాంత్, హర్భజన్ సింగ్ వివాదానికి సంబంధించి అరుదైన వీడియోను మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ విడుదల చేశారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
వచ్చే నెల 9వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ రెండు జట్లు కలిసి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ లెజెండ్ మైకేల్ క్లార్క్ కేన్సర్ బారిన పడ్డాడు. అతడికి స్కిన్ కేన్సర్ సోకినట్టు తెలిపాడు. స్కిన్ కేన్సర్ కారణంగా మరో సర్జరీ చేయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా క్లార్క్ 2004-2015 మధ్య కాలంలో కీలకంగా వ్యవహరించాడు.