Kaif on Gill: ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు.. ఇక మార్చండి.. గిల్‌పై మహ్మద్ కైఫ్ ఆగ్రహం..
ABN , Publish Date - Dec 15 , 2025 | 07:19 PM
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి అవసరమని, చాలా రోజులుగా బెంచ్‌కే పరిమితమవుతున్న సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి అవసరమని, చాలా రోజులుగా బెంచ్‌కే పరిమితమవుతున్న సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. గత మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సంజూ శాంసన్ తనకు అన్యాయం జరుగుతున్నట్టుగా భావించే అవకాశం ఉందని కైఫ్ పేర్కొన్నాడు (Shubman Gill T20I).
'వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ చాలా నమ్మకం ఉంచుతోంది. పెద్దగా రాణించకపోయినా అతడిని జట్టులో కొనసాగిస్తోంది. ప్రస్తుతం అతడి ఫామ్ పేలవంగా ఉంది. జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. గత ఆరు మ్యాచ్‌లుగా సంజూ శాంసన్‌కు అవకాశం రాలేదు. వరుసగా విఫలమవుతున్నా ఏడాదిగా గిల్‌కు జట్టులో చోటు కల్పిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి చూసి సంజూ తనకు అన్యాయం జరుగుతున్నట్టు భావిస్తాడేమో' అని కైఫ్ అభిప్రాయపడ్డాడు (Mohammad Kaif statement).
'గిల్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికైనా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనైనా సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇవ్వాలి. ప్రయోగాలు చేయడానికి వెనుకాడకూడదు. 2026 టీ20 ప్రపంచకప్ నాటికి సరైన లైనప్‌ను సెట్ చేయాలి' అని కైఫ్ సూచించాడు (T20I selection debate). దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే జరిగిన మూడు టీ20ల్లో రెండింటిని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు