Share News

IPL Auction 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:14 PM

అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరకు కేకేఆర్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డు సృష్టించాడు.

IPL Auction 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?
Cameron Green

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL Auction 2026) అబుదాబి వేదికగా ప్రారంభంమైంది. అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులోకి వచ్చింది. చివరకు కేకేఆర్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2024లో మిచెల్‌ స్టార్క్‌ను కేకేఆర్ రూ. 24.75 కోట్లుకు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డును ఈ 26 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో కామెరూన్‌ గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. రిషభ్‌ పంత్ (రూ.27 కోట్లు, LSG, ఐపీఎల్ 2025 వేలం), శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు, పంజాబ్ కింగ్స్,ఐపీఎల్ 2025 వేలం) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


గ్రీన్‌కు వచ్చేది ఎన్ని కోట్లంటే?

అయితే కామెరూన్ గ్రీన్ దక్కించుకున్న రూ. 25.20 కోట్లలో బీసీసీఐ కోత విధించనుంది. ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం.. విదేశీ ఆటగాళ్లు రూ.18 కోట్ల కంటే ఎక్కువ ధర పలికితే, ఆపై మిగిలిన మొత్తాన్ని బీసీసీఐ ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు చేయనుంది. దీంతో గ్రీన్ పలికిన ధరలో 7.20 కోట్లు బీసీసీఐకి వెళ్లనున్నాయి.


ఇక ఇతర ఆటగాళ్ల విషయానికి వస్తే.. ప్రస్తుత వేలంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను అతడి కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. రూ.7 కోట్లకు వెంకటేశ్‌ను బెంగళూరు సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్‌(Quinton de Kock)ను కనీస ధర రూ.కోటికి ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్‌(Finn Allen)ను రూ.2 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగను రూ.2 కోట్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.



ఇవి కూడా చదవండి:

Abhijnaan Kundu: అభిజ్ఞాన్‌ కుందు డబుల్‌ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్

Updated Date - Dec 16 , 2025 | 05:15 PM