Share News

IPL 2026: ఐపీఎల్ వేలంలో నయా రూల్.. ఏంటో తెలుసా?

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:45 AM

అబుదాబి వేదికగా నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో బీసీసీఐ ఓ కొత్త నియమాన్ని రూపొందించింది. ఒకే ఆటగాడి కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఒకే బిడ్‌పై నిలిచిపోయినప్పుడు ‘టై-బ్రేకర్’ నియమాన్ని వాడుతారు.

IPL 2026: ఐపీఎల్ వేలంలో నయా రూల్.. ఏంటో తెలుసా?
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. నేడు(మంగళవారం) అబుదాబీ వేదికగా మినీ వేలం జరగనుంది. అయితే ఈ సందర్భంగా బీసీసీఐ ఓ కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త రూల్ క్రికెట్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచే అవకాశం ఉంది. ఒకే ఆటగాడి కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఒకే బిడ్‌పై నిలిచిపోయినప్పుడు ఈ నియమం అమలులోకి వస్తుంది. అదే ‘టై-బ్రేకర్’ నియమం.


ఎప్పుడు వాడతారంటే?

గతంలో పొలార్డ్, జడేజా వంటి ఆటగాళ్లను తీసుకోవడానికి పెద్ద బిడ్డింగ్ యుద్ధమే జరిగింది. ఆ తర్వాత రహస్య చర్చల ద్వారా జట్లు తమ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇలాంటి క్లిష్టమైన హై-లెవెల్ టైలను పరిష్కరించడానికి ఈ కొత్త రూల్ రూపొందించారు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కొనుగోలు చేసేందుకు కేవలం కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల వద్ద మాత్రమే ఎక్కువ డబ్బు(పర్స్‌లో బ్యాలెన్స్) ఉంది. ఈ కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన కామెరూన్ గ్రీన్, ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ విదేశీ ఆటగాళ్ల కోసం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ కేవలం రూ. 2.75 కోట్ల పర్స్‌తో ఈ బిడ్డింగ్‌లో పాల్గొనటుండటం గమనార్హం.


అసలేంటీ రూల్?

ఒకే బిడ్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు నిలిచిపోయినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి బీసీసీఐ(BCCI) నిర్ణయించిన నియమిది. ఒకే బిడ్‌పై జట్లు లాక్ అయినప్పుడు, బోర్డు వారికి ఒక ‘టై-బ్రేకర్ ఫామ్’ అందిస్తుంది. ఈ ఫామ్‌లో ఫ్రాంచైజీలు భారతీయ రూపాయల్లో ఒక ‘రహస్య బిడ్’ మొత్తాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆటగాడికి చెల్లించరు. ఇది బీసీసీఐకి చెల్లించాల్సిన మొత్తం. రహస్య బిడ్‌లో అత్యధిక మొత్తం రాసిన జట్టు ఆ ఆటగాడిని గెలుచుకుంటుంది. విజేత జట్టు ఆ ‘రహస్య బిడ్’ మొత్తాన్ని డిసెంబర్ 16 వేలం తేదీ నుండి 30 రోజులలోపు బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు

వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు

Updated Date - Dec 16 , 2025 | 10:21 AM