Shaheen Afridi: ఘోర అవమానం.. ఓవర్ మధ్యలోనే షాహిన్ అఫ్రిదిపై సస్పెన్షన్!
ABN , Publish Date - Dec 16 , 2025 | 08:05 AM
బీబీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి ఘోర అవమానం ఎదురైంది. రాకాసి బౌలింగ్ కారణంగా ఫీల్డ్ అంపైర్ అతడిని ఓవర్ మధ్యలో బౌలింగ్ నుంచి తప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి ఘోర అవమానం ఎదురైంది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో.. ఓవర్ మధ్యలోనే అతడి బౌలింగ్‌ను ఫీల్డ్ అంపైర్ రద్దు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే అఫ్రిది(Shaheen Afridi)కి బీబీఎల్‌లో ఇది అరంగేట్ర మ్యాచ్ కావడం కొసమెరుపు.
బిగ్ బాష్ లీగ్(BBL)లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాహీన్ అఫ్రిది.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ వేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆ ఓవర్లో మూడో బంతిని హై ఫుల్ టాస్ వేయగా.. హెల్మెట్‌కు తాకింది. అంపైర్ నోబాల్ ఇవ్వడంతో పాటు తొలి బీమర్‌గా వార్నింగ్ ఇచ్చాడు. నాలుగో బంతిని మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ దిశగా ఫుల్‌టాస్ వేసాడు. ఈ బంతిని కూడా అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. ఇక ఐదో బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్ నోబాల్ ఇచ్చి బౌలర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
రూల్స్ ప్రకారం..
ఐసీసీ(ICC) రూల్స్ ప్రకారం ఒకే ఓవర్‌లో రెండు బీమర్స్ వేస్తే బౌలర్‌ను మ్యాచ్ మొత్తం బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తారు. షాహిన్ అఫ్రిది విషయంలోనూ ఈ చర్యలే తీసుకున్నారు. మ్యాచ్ రిఫరీ అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్ ఫీజులోనూ కోత విధించే ఛాన్స్ ఉంది. అయితే అఫ్రిది బౌలింగ్‌ను మెక్‌స్వీని పూర్తి చేశాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా షఫాలీ వర్మ
ఐపీఎల్ వేలంలో నయా రూల్.. ఏంటో తెలుసా?