Shafali Verma: ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా షఫాలీ వర్మ
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:13 AM
వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ‘ఉత్తమ ప్లేయర్ అవార్డు’ కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికాను ఓడించి.. టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ నెలకు సంబంధించి మహిళల క్రికెట్ ఉత్తమ ప్లేయర్ అవార్డును ఐసీసీ తాజాగా ప్రకటించింది. అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించుకుని.. వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అద్భుత ఆల్‌రౌండ్ షో చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma)కే ఉత్తమ ప్లేయర్ అవార్డు దక్కింది.
ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు ముందు ఓపెనర్ ప్రతీక రావల్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లు అంతగా రాణించలేదు. దక్షిణాఫ్రికాతో తుది పోరులో 78 బంతుల్లో 87 పరుగులు చేసిన షఫాలీ.. బంతితోనూ రాణించి, రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ అవార్డు కోసం పుత్తవాంగ్(థాయ్‌లాండ్), ఇషా ఓజా(యూఏఈ) నుంచి గట్టి పోటీ ఎదురైనా.. ఆఖరికి ఉత్తమ ప్లేయర్ అవార్డు షఫాలీనే వరించింది.
పురుషుల్లో ఎవరంటే..?
పురుషుల క్రికెట్‌లో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ సిమోన్ హార్మర్ నవంబర్‌కు ‘ఉత్తమ ప్లేయర్ అవార్డు’ దక్కించుకున్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో హార్మర్ 1.91 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. తైజుల్ ఇస్లామ్(బంగ్లాదేశ్), మహ్మద్ నవాజ్(పాకిస్తాన్)లను అతడు వెనక్కినెట్టి ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు