Share News

Ind Vs SA T20: ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. స్కోరు 213/4

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:20 PM

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేయగిలిగింది. డికాక్ 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు.

Ind Vs SA T20: ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. స్కోరు 213/4
Ind VS SA T20

ఇంటర్నెట్ డెస్క్: మొదటి టీ20 మ్యాచ్‌లో ఓటమి చవి చూపిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌‌లో దూకుడు కనబరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు డికాక్ కీలకంగా నిలిచాడు. 90 పరుగులతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. భారత బౌలర్లు ఈమారు తడబడటంతో ప్రత్యర్థి పరుగులు పిండుకోగలిగారు.


నిలకడగా ఆడుతున్న డికాక్‌.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 16వ ఓవర్‌లో రన్ ఔట్‌గా వెనుదిరగడంతో భారత్‌కు కీలక వికెట్ లభించింది. అయితే, డెత్ ఓవర్లలో భారత్ బౌలర్లు డీలా పడటంతో మళ్లీ కోలుకున్న దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది. డికాక్ జట్టుకు కీలకంగా నిలవగా మార్‌క్రమ్(29), డోనొవాన్ ఫరీరా(30), డేవిడ్ మిల్లర్ (20) చివరి ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్‌లు, అక్షర్ పటేల్ ఒక వికెట్‌ను తీశారు. అర్ష్‌దీప్ నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చుకోవడంతో పాటు ఒకే ఓవర్‌లో ఏకంగా ఏడు వైడ్స్ వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

Updated Date - Dec 11 , 2025 | 09:35 PM