Share News

IND vs SA: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన దక్షిణాఫ్రికా..

ABN , Publish Date - Dec 14 , 2025 | 08:53 PM

ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ-20లో భారత బౌలర్లు చెలరేగారు. సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

IND vs SA: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన దక్షిణాఫ్రికా..
IND vs SA

ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ-20లో భారత బౌలర్లు చెలరేగారు. సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది (India vs South Africa).


టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ టీమిండియా బౌలర్లు చెలరేగారు. హర్షిత్, అర్ష్‌దీప్ ధాటికి దక్షిణాఫ్రికా 7 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్నప్పటికీ ఐదెన్ మార్‌క్రమ్ (61) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. డోనావన్ (20), నోర్ట్జే (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు (IND vs SA live update).


టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఒక్కో వికెట్ పడగొట్టారు. చివరకు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. కటక్ మ్యాచ్‌లో టీమిండియా, ముల్లాన్‌పూర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి. ధర్మశాలలో గెలిచి సిరీస్‌లో ముందడుగు వేయాలని ఇరు జట్లు కృత నిశ్చయంతో ఉన్నాయి


ఇవి కూడా చదవండి:

ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. సౌతాఫ్రికా హెడ్ కోచ్

టాస్ గెలిచిన పాకిస్తాన్

Updated Date - Dec 14 , 2025 | 09:59 PM