U19 Asia Cup 2025: టాస్ గెలిచిన పాకిస్తాన్
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:37 AM
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన విషయం తెలిసిందే. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో టాస్ వేశారు. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ అండర్ 19 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా భారత్-పాకిస్తాన్ తలపడుతున్నాయి. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైన విషయం తెలిసిందే. పరిస్థితి కొంచెం అనుకూలించడంతో తాజాగా టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. వర్షం కారణంగా మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. క్రీజులోకి కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వచ్చారు.
భారత తుది జట్టు:
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అరోజ్ జార్జి, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కాన్షిక్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హేనిల్ పటేల్
పాకిస్థాన్ తుది జట్టు:
ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలి హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హమ్జా జహూర్ (వికెట్ కీపర్), హుజైఫా అషన్, నికబ్ సాఫిక్, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రాజా.
ఇవి కూడా చదవండి:
అతడిని తక్కువగా అంచనా వేస్తున్నారు: మాజీ కెప్టెన్ శ్రీకాంత్
ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధమే:తిలక్ వర్మ