Ind Vs Pak: వర్షం అంతరాయం.. టాస్ ఆలస్యం
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:10 AM
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ కూడా ఆలస్యంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాక్ మధ్య పోరు జరగనుంది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. కాగా ఇప్పటికే టాస్ వేయాల్సి ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ ఆలస్యం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ కూడా ఆలస్యంగానే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసింది. సెంచరీల సంచలనం టీమిండియా స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో సారి సెంచరీ(171, 95 బంతుల్లో, 9 ఫోర్లు, 14 సిక్సులు)తో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఈఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 234 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
అతడిని తక్కువగా అంచనా వేస్తున్నారు: మాజీ కెప్టెన్ శ్రీకాంత్
ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధమే:తిలక్ వర్మ