IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ-20, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:50 PM
టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ-20 ఆడడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. కటక్ మ్యాచ్‌లో టీమిండియా, ముల్లాన్‌పూర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి.
టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ-20 ఆడడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. కటక్ మ్యాచ్‌లో టీమిండియా, ముల్లాన్‌పూర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి. ధర్మశాలలో గెలిచి సిరీస్‌లో ముందడుగు వేయాలని ఇరు జట్లు కృత నిశ్చయంతో ఉన్నాయి (India vs South Africa toss).
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. అక్షర్ పటేల్, బుమ్రా ఈ మ్యాచ్ ఆడడం లేదని సూర్యకుమార్ ప్రకటించాడు. వారిద్దరి స్థానంలో హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరి, ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి (IND vs SA live update).
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: హెన్రిక్స్, క్వింటన్ డికాక్, ఐదెన్ మార్‌క్రమ్, బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనావన్ ఫెరీరా, మార్కో యన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడి, బార్ట్‌మన్
ఇవి కూడా చదవండి:
ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. సౌతాఫ్రికా హెడ్ కోచ్