IND vs SA: ఊదేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం..
ABN , Publish Date - Dec 14 , 2025 | 10:20 PM
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో భారత జట్టు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన స్వల్ప స్కోరును టీమిండియా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు.
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో భారత జట్టు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన స్వల్ప స్కోరును టీమిండియా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. టీమిండియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఏకంగా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఐదు టీ-20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లారు (India vs South Africa).
అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఒక పక్క వికెట్లు పడుతున్నప్పటికీ ఐదెన్ మార్‌క్రమ్ (61) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. డోనావన్ (20), నోర్ట్జే (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు (IND vs SA live update).
చివరకు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. 118 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. అభిషేక్ శర్మ (35), శుభ్‌మన్ గిల్ (28) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. వీరు అవుటైన తర్వాత తిలక్ వర్మ (26 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. చివరకు టీమిండియా 15.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..