Home » Congress
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
మాజీ ఎమ్మెల్యే రేగా కాం తారావు చేస్తున్న ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ నాయకు లు గానీ కార్యకర్తలు కానీ భయపడే పరిస్థితులు లేవని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్ నగర్ వెంచర్ త్రీ, రాజీవ్‌నగర్ కాలనీ, జయంతి నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు.
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.
పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్‌లు చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.
సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్‌లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ వైపుకు స్టాండ్ తీసుకొని శత్రు దేశం భాషలో మాట్లాడుతూ శత్రువుల మాటలను సిగ్గు లేకుండా వల్లెవేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా నిజానిజాలు తెలియకుండా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
హైదరాబాద్ మహా నగరానికి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఇప్పటివరకు చోటు లేదు. రిటైర్డ్ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ను ఇప్పుడు మంత్రి పదవి వరించింది.
రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కానీ ఇటీవల అన్ని విషయాలలోను కాంగ్రెస్‌కు చెందిన వారు హాట్‌టాపిక్ గా మారుతున్నారు. అటువంటి వారిలో చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా ఒకరు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఓటు బ్యాంక్‌లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు.