Share News

కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..

ABN , Publish Date - Jan 27 , 2026 | 09:29 PM

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన స్వంత పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లో జరిగిన పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు.

కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..
Shashi Tharoor skips meeting

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన స్వంత పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లో జరిగిన పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు. వచ్చే వారం జరగబోయే పార్లమెంటు సమావేశానికి ఎలా సంసిద్ధం కావాలనే అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. బీజేపీని పార్లమెంట్‌లో ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చ జరిగింది (Shashi Tharoor skips meeting).


కీలకమైన ఈ సమావేశానికి ఎంపీ శశి థరూర్ దూరంగా ఉన్నారు (Tharoor Dubai literature festival). శశి థరూర్ దుబాయ్‌లో జరుగుతున్న సాహిత్య ఉత్సవంలో పాల్గొన్నారని, మంగళవారం రాత్రి తిరిగి భారత్‌కు వస్తారని సమాచారం. తాను అందుబాటులో ఉండడం లేదని కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు శశి థరూర్ తెలియజేసినట్లు సమాచారం. గత నాలుగు రోజుల్లో పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరుకాకపోవడం థరూర్‌కు ఇది రెండోసారి. గత వారం కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి కూడా థరూర్ హాజరు కాలేదు.


కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన శశి థరూర్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది (Congress internal tensions). ఆ పార్టీకి ఆయన కొంతకాలంగా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ తరఫున శశి థరూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు గత శుక్రవారం సమావేశం నిర్వహించారు. కేరళకు చెందిన పలువురు కీలక నేతలు, జాతీయ స్థాయి నేతలు హాజరయ్యారు. కానీ, కేరళకే చెందిన శశి థరూర్ మాత్రం వెళ్లలేదు.


ఇవి కూడా చదవండి..

సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..


చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..

Updated Date - Jan 27 , 2026 | 09:29 PM