Home » Congress
బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో వాయిదా పడిన తెలంగాణ శాసనసభ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దుర్భాషలాడారని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద బీఆర్‌ఎస్ నిరసన, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. నల్ల టీషర్టులు ధరించి, ఫ్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత బయటకు రారని.. ఎల్పీ మీటింగ్ కూడా ఫౌంహౌస్‌లోనే చేస్తారా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. సబండ వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ విమోచన జైత్రయాత్ర భారీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అలాగే ముందస్తుగా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ బహిరంగ సభ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు(ఆదివారం)మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ధరణి పేరుతో బీఆర్‌ఎస్ మోసం చేసిందని.. ఇప్పుడు భూభారతి పేరుతో కాంగ్రెస్ అవినీతికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంబరాలు దేని కోసం.. అధికారంలోకి రావడానికి చేసిన హామీలన్నీ విస్మరించినందుకా అని ప్రశ్నించారు.
హనుమకొండ జిల్లా భీమారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమానికి హాజరవుతున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.