Home » Congress Govt
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి(32) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు రక్షించడానికి ప్రయత్నం చేయగా.. అప్పటికే మీన్రెడ్డి మృతి చెందాడు.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో సెంటిమెంట్ రాజకీయాలు పనికిరావని విమర్శించారు సీఎం రేవంత్రెడ్డి. .
తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్ని పక్కనబెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అధికారకంగా వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
మాజీమంత్రి కేటీఆర్కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాతమని కేటీఆర్ తెలిపారు. సంతోషంగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు.
మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.