Home » CM Stalin
అమెరికా విధించిన సుంకాల ప్రభావం తమిళనాడులోని సముద్ర ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి..
మొట్టమొదటి ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కేరళ సీఎం విజయన్‌పై బీజేపీ మండిపడింది.
ప్రస్తుతం దేశంలో సమాఖ్యవాదం, రాజ్యాంగం ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని, తనను గెలిపిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు...
కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించేదిశగా ఎన్నో కమిటీలు ఏర్పాటైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించివేయడమే పనిగా పెట్టుకుందని, జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టడం భావ్యమేనా అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.
తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు
వచ్చే యేడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా అన్నాడీఎంకే జాతీయపార్టీ బీజేపీతో అత్యవసరం పొత్తును ఖరారు చేసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ వెలువడక ముందే ఓటర్ల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సవరించాలే తప్ప, బిహార్ తరహా సవరణ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం డిమాండ్ చేసింది.
కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీల్లో పనిచేస్తున్న తాత్కాలిక పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌దే తుది నిర్ణయమని పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పష్టంచేశారు.
పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరిందని, గత నాలుగేళ్ల డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పురోగమించినట్లు కేంద్రప్రభుత్వమే ప్రకటించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.