Share News

MK Stalin: ప్రమాదం అంచుల్లో రాజ్యాంగం

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:00 AM

ప్రస్తుతం దేశంలో సమాఖ్యవాదం, రాజ్యాంగం ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని, తనను గెలిపిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు...

MK Stalin: ప్రమాదం అంచుల్లో రాజ్యాంగం

  • తమిళనాడు నేతలతో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

చెన్నై, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం దేశంలో సమాఖ్యవాదం, రాజ్యాంగం ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని, తనను గెలిపిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు. సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళనాడు ఎంపీల మద్దతు కోరేందుకు ఆయన ఆదివారం చెన్నై వచ్చారు. సాయంత్రం డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌, ఆ పార్టీ మిత్రపక్షాల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తమిళనాడును దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా స్టాలిన్‌ ముందుకు నడిపిస్తున్నారని, విద్య, వైద్య రంగాలలో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు. రాష్ట్ర హక్కుల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భారతదేశం, రాజ్యాంగం గురించి తెలియని వారంతా ఒకే దేశం అంటూ నినాదాలు చేస్తున్నారని, ఒకే దేశం అంటే రాష్ట్రాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మరచిపోతున్నారని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 03:00 AM