Share News

CM Stalin: గుర్తుపెట్టుకోండి.. నా నిర్ణయాలు... దీర్ఘకాలిక ప్రయోజనాలు

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:06 AM

స్టాలిన్‌ అంటేనే ‘మేన్‌ ఆఫ్‌ స్టీల్‌’ అనేలా తాను తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉంటాయని, అంతే కాకుండా కార్యసాధనలో తనకు పట్టుదల ఎక్కువేనని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు.

CM Stalin: గుర్తుపెట్టుకోండి..  నా నిర్ణయాలు... దీర్ఘకాలిక ప్రయోజనాలు

- హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం

- పెట్టుబడిదారుల సదస్సులో సీఎం స్టాలిన్‌

చెన్నై: స్టాలిన్‌ అంటేనే ‘మేన్‌ ఆఫ్‌ స్టీల్‌’ అనేలా తాను తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉంటాయని, అంతే కాకుండా కార్యసాధనలో తనకు పట్టుదల ఎక్కువేనని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు. హోసూరులో శుక్రవారం ఉదయం జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కృష్ణగిరి జిల్లా హోసూరు వద్ద 2వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పనున్నట్లు స్టాలిన్‌ ప్రకటించారు.


గతంలో హోసూరు చిన్న వాణిజ్య నగరంగా ఉండేదని, ప్రస్తుతం ఈ నగరంలో ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు దేశవిదేశాల నుండి పారిశ్రామికవేత్తలు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలోనే 5లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల జర్మనీ, ఇంగ్లండ్‌ దేశాల్లో పర్యటించి రూ.15,516 కోట్ల మేర విదేశీ పెట్టుబడులను సమీకరించగలిగానని, ఆ సంతోషంతోనే హోసూరులో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.


nani2.2.jpg

ఈ సదస్సులో రూ.26వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా ఎనిమిదివేల మందికి ఉపాధి కలిగించేలా రూ.1600 కోట్లతో చేపట్టనున్న నాలుగు పథకాలకు శంకుస్థాపన చేయడం కూడా సంతోషకరమన్నారు. గత నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో 77 శాతం మేర కొత్త కర్మాగారాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల్లో విస్తరణ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.


92 ఒప్పందాలు... రూ.24,307కోట్ల పెట్టుబడులు...

ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక, వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో హోసూరులో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 53 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ ప్రకారం ప్రముఖ కంపెనీలు రూ.23,303.15 కోట్ల మేరకు పెట్టుబడులతో కొత్త ప్యాక్టరీలు నెలకొల్పి 44,870 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఎంఎ్‌సఎంఈ శాఖ ఆధ్వర్యంలో రూ.10003.85 కోట్లతో 4483 మందికి ఉపాధి కల్పించేలా 39 ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ మొత్తం 24,307 కోట్ల పెట్టుబడులతో 92 ఒప్పందాలతో 49,353 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అనంతరం గురువారం సాయంత్రం డెల్టా ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ న్యూ డెల్టా స్పాట్‌ ఉ త్పత్తి కేంద్రాన్ని కూడా స్టాలిన్‌ ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 12 , 2025 | 11:06 AM