Share News

CM Stalin Request: పరిశ్రమల్ని ఆదుకోండి

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:58 AM

అమెరికా విధించిన సుంకాల ప్రభావం తమిళనాడులోని సముద్ర ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి..

CM Stalin Request: పరిశ్రమల్ని ఆదుకోండి

చెన్నై, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): అమెరికా విధించిన సుంకాల ప్రభావం తమిళనాడులోని సముద్ర ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. తూత్తుకుడిలో ని సీఫుడ్స్‌ సంస్థల్లో 50ుఉత్పత్తి నిలిచిపోయింది. తిరుప్పూరులో 35 లక్షల బనియన్లు కర్మాగారాల్లో పేరుకుపోయాయి. అమెరికా దిగుమతి చేసుకునే సీఫుడ్స్‌లో 26.5ు దాకా భారత్‌ నుంచే వెళుతుంది. తమిళనాడులో 25 దాకా సీఫుడ్స్‌ ఎగుమతి సంస్థలుండగా, వీటిల్లో 11 సంస్థలు తూత్తుకుడిలోనే నడుస్తున్నాయి. ఈ సంస్థల నుంచే అమెరికాకు చేపలు, రొయ్యలు, పీతలు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా సుంకాలదెబ్బతో ప్రస్తుతం 50ు దాకా ఎగుమతి నిలిపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ ప్రధాని మోదీని సీఎం స్టాలిన్‌ కోరారు. గత ఏడాది భారతదేశం నుండి రూ.60 వేల కోట్ల విలువైన సీఫుడ్స్‌ అమెరికాకు ఎగుమతి అయ్యాయి.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 02:58 AM