Home » CM Revanth Reddy
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచన చేస్తు్న్నట్లు చెప్పారు.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, ఆదుకుంటామని, పంట నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
మహ్మద్ ప్రవక్త జన్మదినం ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి గురువారం వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకాన్ని 2027 డిసెంబరు 9వ తేదీకల్లా పూర్తి చేయాలని , అదే రోజున తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆదేశించారు. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చస్తున్నారని.. చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కామారెడ్డి జిల్లాలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌కు చేరుకోని వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బి బ్రిడ్జ్‌ను పరిశీలించనున్నారు.
బీఆర్ఎస్ ప్రజలను దోచుకున్న అనకొండ.. పంపకాల్లో తేడాలొచ్చి ఒకరితో ఒకరు కొట్టుకుంటూ మాపై ఎందుకు నిందలు వేస్తున్నారని అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.
ST జాబితాపై సొంత పార్టీ నాయకులతోనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేయించారని దయాకర్ రావు విమర్శించారు. లంబాడీ బిడ్డల హక్కులను రేవంత్ రెడ్డి చెడగొట్టేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.