Share News

CM Revanth: రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

ABN , Publish Date - Sep 03 , 2025 | 10:04 PM

కామారెడ్డి జిల్లాలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌‌లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌కు చేరుకోని వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బి బ్రిడ్జ్‌ను పరిశీలించనున్నారు.

CM Revanth: రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు జలమయం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ఎన్నడూ లేని విధంగా.. 36.8 సెం.మీల వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో జిల్లా మొత్తం జలమయంగా మారిపోయింది. వరద ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు చెరువులను తలపించాయి. భారీ వర్షాల ధాటి నుంచి ఇప్పటికి కూడా జిల్లా పూర్తిగా కోలుకోలేదని చెప్పవచ్చు.


ఈ నేపథ్యంలో.. కామారెడ్డి జిల్లాలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌‌లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌కు చేరుకోని వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బీ బ్రిడ్జ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. తదననంతరం కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జీఆర్ కాలనీని సందర్శించనున్నారు. బాధిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడి.. వరద నష్టంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నట్లు సమాచారం.


కామారెడ్డి జిల్లాలు 36.8 సెం.మీల వర్షపాతం నమోదు అయిన విషయం తెలిసిందే. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా.. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు కూలాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. వాగులు పొంగాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్భందమయ్యాయి.


Also Read:

పైనాపిల్ అందరికీ కాదండోయ్! ఈ 5 రకాల వాళ్లు దూరంగా ఉండాలి..

డెస్క్ వర్క్ చేసేవారికి షుగర్ కంట్రోల్ టెక్నిక్స్!

Updated Date - Sep 03 , 2025 | 10:05 PM