Diabetes Tips for Desk Workers: డెస్క్ వర్క్ చేసేవారికి షుగర్ కంట్రోల్ టెక్నిక్స్!
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:12 PM
శారీరకంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఆఫీసులో పూర్తి స్థాయిలో పనిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డెస్క్ వర్క్ చేసే డయాబెటిస్ పేషెంట్లకు ఇది పెద్ద టాస్కే. అయితే, ఆఫీసు పనిలో బిజీగా ఉన్నా.. ఈ చిన్న మార్పులతో షుగర్ ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
గతంలో, ఓ వయస్సు దాటాకే కొన్ని వ్యాధులు వచ్చేవి. కానీ నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండానే అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వాటిలో డయాబెటిస్ ఒకటి. యువకులు, పసి పిల్లలు సైతం ఈ వ్యాధికి గురవుతున్నారు. రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. డెస్క్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి తీరిక ఉండదు. ఈ కారణంగా డయాబెటిస్ మరింత తీవ్రం కావచ్చు. కాబట్టి, షుగర్ పేషెంట్లు వారి ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆఫీసులో ఈ సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా పని, ఆరోగ్యం మధ్య సమతుల్యతను కాపాడుకోవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా మూత్ర విసర్జన చేయడం, దాహం వేయడం, ఎక్కువ ఆకలిగా అనిపించడం, అలసట, గాయం త్వరగా మానకపోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల నిరంతరం శ్రద్ధ వహించాలి. లేకుంటే భవిష్యత్తులో ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు. అధిక చక్కెర స్థాయి కారణంగా, కళ్ళు, మూత్రపిండాలు, నరాలు దెబ్బతింటాయి. దీనితో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఆఫీసులో షుగర్ పేషెంట్లు తమకు ఎదురయ్యే సవాళ్లను ఈ సింపుల్ టెక్నిక్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
షుగర్ ఉన్నవారు ఆఫీసులో అనుసరించాల్సిన రోజువారీ టిప్స్
1.తరచుగా కదలండి
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బయో సైకిల్ విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి, ప్రతి 30 నుండి 60 నిమిషాలకు కాసేపు అటూ ఇటూ వేగంగా నడవండి. స్ట్రెచింగ్ చేయండి. మీటింగ్స్ లో ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించండి. ఈ కదలికలు దీర్ఘకాలిక హానికరమైన ప్రభావాలను తప్పిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
2.డైట్ ఎంపికలో జాగ్రత్త
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి, పోషకాలు అధికంగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఫైబర్, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన భోజనం స్థిరమైన శక్తిని అందిస్తుంది. రక్తంలో చక్కెరలు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.
3.క్రమం తప్పకుండా హెల్త్ చెకప్
వార్షిక ఆరోగ్య పరీక్షలు ఆన్-సైట్ గ్లూకోజ్ పర్యవేక్షణ మార్పులను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి. జీవనశైలి లేదా మందులకు సకాలంలో సర్దుబాట్లు చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి.
4.ఒత్తిడిని నిర్వహణ
ఒత్తిడి రక్తంలో చక్కెరను పెంచుతుంది. మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస వ్యాయామాలు లేదా పగటిపూట చిన్నపాటి విరామాలు వంటి సాధారణ పద్ధతులు భావోద్వేగ శ్రేయస్సు, గ్లూకోజ్ నియంత్రణ రెండింటినీ మెరుగుపరుస్తాయి.
5.హైడ్రేటెడ్ గా ఉండండి
మెరుగైన జీవక్రియకు తగినంత నీరు తాగండి. శరీరం నుండి అదనపు చక్కెరను తొలగించడానికి సహాయపడుతుంది. నిర్జలీకరణం వల్ల కలిగే అసమతుల్యతను నివారిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ పువ్వు షుగర్ పేషెంట్లకు దివ్యౌషధం!
భోజనానికి ముందు నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? హార్వర్డ్ రీసెర్చ్‌లో తేలిందిదే..
For More Health News