Drinking Water Before Meal: భోజనానికి ముందు నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? హార్వర్డ్ రీసెర్చ్‌లో తేలిందిదే..
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:55 PM
drink water before meal help weight loss: తక్కువ ఆహారం తింటే త్వరగా బరువు తగ్గుతారనే అపోహ ఉంది. అందుకే చాలామంది భోజనానికి ముందు నీళ్లు తాగుతారు. ఎక్కువ ఆకలి వేయదని. ఇంతకీ, ఈ పద్ధతి సరైనదేనా? ఈ అంశం గురించి హార్వర్డ్ పరిశోధకులు చెప్పిన షాకింగ్ నిజాలేంటి?
బరువు తగ్గడానికి చాలామంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. వాటిలో ఒకటే భోజనానికి ముందు నీరు తాగడం. బరువు తగ్గాలనుకుంటే తినడానికి ముందు ఎక్కువ తాగాలని కొందరు తరచుగా చెబుతారు. ఇలా చేస్తే కడుపు నీటితో నిండిపోవడం వల్ల తక్కువ ఆహారం తింటాము. కానీ ఇలా చేయడం సరైనదేనా? ఆయుర్వేద నిపుణులు ఈ విషయమై ఏం చెప్పారు? ఇటీవల హార్వర్డ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఏం తేలింది? ఆయుర్వేదం, సైన్స్ రెండూ ఒకే అంశాన్నే చెబుతున్నాయా?
ఆయుర్వేదం ప్రకారం తినడానికి ముందు నీరు తాగితే..
ఆయుర్వేదం ప్రకారం, తినడానికి అరగంట లేదా పదిహేను నిమిషాల ముందు నీరు తాగకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులోని అగ్ని బలహీనపడుతుంది. దీని కారణంగా శరీరం అనేక వ్యాధులతో చుట్టుముడతాయి. రోగనిరోధకశక్తి నశించి శరీరం బలహీనంగా మారుతుంది.
జీర్ణ సమస్య
ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో అగ్ని ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. మనం తినడానికి ముందు నీరు తాగితే ఈ అగ్ని నెమ్మదిగా చల్లారుతుంది. ఆహారం తిన్నా సరిగ్గా జీర్ణం కాదు. దీని కారణంగా అజీర్ణం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణక్రియకు సంబంధించిన అనేక జీర్ణ సమస్యలు మొదలవుతాయి.
హార్వర్డ్ అధ్యయనంలో ఏం తేలింది
హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం 3 సిద్ధాంతాలను పేర్కొంది. వాటిలో ఒకటి ఏమిటంటే ప్రజలు దాహం వేసినప్పుడు వారు తరచుగా ఆకలితో ఉన్నారని భావిస్తారు. ఈ సమయంలో నీరు తాగితే అతిగా తినడం నివారించవచ్చు.
మరొక సిద్ధాంతం ప్రకారం, నీరు తాగడం వల్ల తక్కువ సమయంలో బరువు తగ్గడం ప్రభావవంతంగా ఉంటుంది. నిజానికి, కడుపు నరాలలో ఇంద్రియాలు ఉంటాయి. ఇవి నీరు తాగాక స్ట్రైచ్ అయినట్లు అనిపిస్తాయి. కడుపు నిండిందని.. ఎక్కువ తినవలసిన అవసరం లేదని మెదడుకు సంకేతాలను ఇస్తాయి. ఆహారం తినడానికి ముందు నీరు తాగే ఈ సిద్ధాంతం తక్కువ సమయంలో బరువు తగ్గడానికి మాత్రమే పనిచేస్తుంది. అయితే, దీని దుష్ప్రభావాలపై ఎటువంటి విషయం వెల్లడించలేదు.
మూడవ థియరీ ప్రకారం, భోజనానికి ముందు నీరు తాగడం అనే ఆలోచన పూర్తిగా తప్పు. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కేలరీలు ఖర్చవుతాయనేందుకు తాజా అధ్యయనంలో ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. కేలరీలు బర్న్ చేయాలనుకుంటే.. భోజనానికి ముందు నీరు తాగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆయుర్వేదం ప్రకారం చూస్తే జీర్ణ ప్రక్రియ నెమ్మదించి బలహీనంగా మారతారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మహిళల్లో ఈ అజాగ్రత్తల వల్ల థైరాయిడ్ ప్రమాదం.!
పురుగులమందులు ఎక్కువ ఉండేది ఈ పండ్లలోనే.. జర జాగ్రత్త..
For More Health News