Share News

KCR On Kavita: బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ..

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:43 PM

బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతలతో కేసీఆర్‌ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌ తదననంతర పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

KCR On Kavita: బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(మంగళవారం) బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. పార్టీ నాయకులతో బీఆర్ఎస్ అధినేత నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కవితను సస్పెండ్ చేస్తూ.. పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.


ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ పార్టీ నేతలతో మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌‌ తరువాత పార్టీ తీసుకోవాల్సీన చర్యలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సంజయ్‌, మాజీ ఎంపీ వినోద్‌లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తరువాత బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం బీఆర్ఎస్ నేతలు కవిత సస్పెన్షన్‌‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 02 , 2025 | 06:47 PM