Share News

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి లంబాడీలపై చిత్తశుద్ధి లేదు..

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:13 PM

ST జాబితాపై సొంత పార్టీ నాయకులతోనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేయించారని దయాకర్ రావు విమర్శించారు. లంబాడీ బిడ్డల హక్కులను రేవంత్ రెడ్డి చెడగొట్టేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి లంబాడీలపై చిత్తశుద్ధి లేదు..

జనగామ: సీఎం రేవంత్ రెడ్డి లంబాడీలను ST జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. దమ్ముంటే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావును వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడారు..


ST జాబితాపై సొంత పార్టీ నాయకులతోనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేయించారని దయాకర్ రావు విమర్శించారు. లంబాడీ బిడ్డల హక్కులను రేవంత్ రెడ్డి చెడగొట్టేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి లంబాడీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నకేసును వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. లంబాడీలను తొలగించడం వల్ల విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీ భూములను గుంజుకుంటున్నారని, 10శాతం ఎస్టీ రిజర్వేషన్ సక్రమంగా అమలు కావడం లేదని ఎర్రబెల్లి ఆరోపించారు.


ST జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్న పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. లంబాడీ, బంజారా, సుగాలీలను గిరిజన వర్గాలుగా గుర్తించడం చట్టవిరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ వేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ అంశంపై రాష్ట్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేస్తూ.. పూర్తి వివరాలు కోరింది. దీనిపై ప్రభుత్వం సమగ్ర వివరాలను సమర్పించాలని గడువు విధించింది. లంబాడీల వల్ల తెలంగాణలో నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు కోర్టులో వాదించారు. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల (సెప్టెంబర్) 9కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 03 , 2025 | 06:13 PM