Governor Jishnu Dev CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు!
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:08 AM
మహ్మద్ ప్రవక్త జన్మదినం ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి గురువారం వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మహ్మద్ ప్రవక్త జన్మదినం ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి గురువారం వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త బోధనలు కరుణ, సహనం, సామరస్యం, సార్వత్రిక సోదర భావంతో మానవాళిని శాంతి, సమష్టి శ్రేయస్సు వైపు నడిపిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. తోటి వారి పట్ల విశ్వాసం, దయ, నమ్మకంతో సేవ చేసినప్పుడు ప్రవక్త మహ్మద్ సందేశాన్ని పాటించిన వారమవుతామన్నారు. నిజమైన స్ఫూర్తితో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. సకల మానవాళికి ఆయన బోధనలు సదా ఆచరణీయమని పేర్కొన్నారు.