Home » CM Revanth Reddy
ఓ మాజీ బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం మళ్లీ రాష్ట్రంలో దుమారం రేపుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎవడెవడో ఎదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో అమిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ఛాన్సలర్ అతుల్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని చౌహాన్ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయనిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్‌లు ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా కోవర్టుగా మారి, ఆంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు బనకచర్లకు ఓకే చెప్పారని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆరోపించారు.
రాష్ట్రపతిపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాల నిడిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.రాజ్‌గోపాల్ రెడ్డితో గురువారం ఫోన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలుపకుంటే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపుతామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దరన్న అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేసిన ధర్నాలో బీసీలకు న్యాయం చేయడం కన్నా గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలనే తపన సీఎం రేవంత్ రెడ్డిలో అధికంగా కనిపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.