Home » CM Revanth Reddy
రామంతాపూర్ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ.. కాలనీ వాసులు రోడ్డెక్కారు. దీంతో రామంతపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. గోఖలే నగర్ విద్యుత్ షాక్ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. రామంతపూర్ రోడ్డుపై బైఠాయించిన కాలనీ వాసులు నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ సర్కార్ పనితీరుతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చర్చలు నడుస్తున్న వేళ.. బీసీ నాయకుడిగా పేరున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీసీల సానుభూతి, అండదండలు పొందడానికే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీలో 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా రూ. 80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో తన కుటుంబసభ్యుల ప్రయోజనంకోసం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్‌రెడ్డి ఆకాంక్ష నెరవేరదని, ఆయన చెప్పే ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి భవిష్యత్తులేదని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వీలున్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈ నెల 23న సమావేశం కానుంది.
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్(KTR) విమర్శించారు. రేవంత్ తన అవివేకంతో.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ కూలిందని హరీష్ రావుకు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయవద్దని చేప్పిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందన్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, నీళ్ల విలువ, రైతుల గురించి తెలియదన్న హరీశ్ రావు..
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ఆపరేషన్ కగార్‌ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం.