Share News

KTR: ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి ఫ్యూచర్‌ లేదు: కేటీఆర్‌

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:32 AM

హైదరాబాద్‌ ఫార్మాసిటీ భూముల్లో తన కుటుంబసభ్యుల ప్రయోజనంకోసం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న రేవంత్‌రెడ్డి ఆకాంక్ష నెరవేరదని, ఆయన చెప్పే ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి భవిష్యత్తులేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు

KTR: ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి ఫ్యూచర్‌ లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌/గంభీరావుపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఫార్మాసిటీ భూముల్లో తన కుటుంబసభ్యుల ప్రయోజనంకోసం రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న రేవంత్‌రెడ్డి ఆకాంక్ష నెరవేరదని, ఆయన చెప్పే ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి భవిష్యత్తులేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దుచేసి, దాని స్థానంలో ఫ్యూచర్‌సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన విమర్శించారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు కాంగ్రెస్‌ సర్కార్‌ చేతిలో మోసపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అవసరంతో పాటు.. ఎన్నికల సంఘానికే సమగ్ర ప్రక్షాళన అవసరమని కేటీఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయని.. విద్యారంగంపట్ల కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలంగాణ భవన్‌లో ఆరోపించారు.


ఆడబిడ్డ ఆహ్వానం.. మనసును కదిలించింది

ఆడబిడ్డ ఆహ్వానం.. తన మనసును కదిలించిందని కేటీఆర్‌ అన్నారు. తండ్రి, అన్నయ్యను కోల్పోయిన నవత అనే యకువతి.. తన వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరిన మేరకు కేటీఆర్‌ ఆదివారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.


తెలంగాణ సర్కార్‌ హెలికాప్టర్‌ను రాహుల్‌ ఏ హాదాలో వాడుతున్నారు?: రాకేశ్‌ రెడ్డి

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ఖర్గే తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఏ హాదాలో వాడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రతిని పట్టుకుని ఊరేగే రాహుల్‌ గాంధీకి ఇది చట్ట విరుద్ధం అని తెలియదా అని నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 04:32 AM