Share News

CM Revanth: నగరంలో ​పాపన్న విగ్రహానికి సీఎం శంకుస్థాపన.. బీసీల మెప్పుకేనా..?

ABN , Publish Date - Aug 18 , 2025 | 08:27 AM

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చర్చలు నడుస్తున్న వేళ.. బీసీ నాయకుడిగా పేరున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీసీల సానుభూతి, అండదండలు పొందడానికే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

CM Revanth: నగరంలో ​పాపన్న విగ్రహానికి సీఎం శంకుస్థాపన.. బీసీల మెప్పుకేనా..?
CM Revanth Reddy

హైదరాబాద్: నగరంలో సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహానికి ఇవాళ(సోమవారం) శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10.30కు ట్యాంక్ బండ్ పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్​ ఎదురుగా, అమరజ్యోతి పక్కన స్థలంలో సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ​జయంతి సందర్భంగా విగ్రహానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11 గంటలకు రవీంద్ర భారతిలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు ఆయన హాజరవుతారు.


సర్వాయి పాపన్న గౌడ్ ​జయంతి వేడుకల ముగించుకుని సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, T-ఫైబర్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అయితే.. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చర్చలు నడుస్తున్న వేళ.. బీసీ నాయకుడిగా పేరున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీసీల సానుభూతి, అండదండలు పొందడానికే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీల పూర్తి మద్దతు కోసం.. కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో బీసీలను సంఘటితం చేసేందుకే విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాగా, విగ్రహం ఏర్పాటుతో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.


మరోవైపు మౌలిక సదుపాయాలు, మూల ధన పనులపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న మౌళిక సదుపాయాలపై చర్చలు జరగనున్నాయి. భారీ వర్షాలు దృష్ట్యా తీసుకోవల్సిన చర్యలపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు.


ఇవి కూడా చదవండి

డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..

చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..

Updated Date - Aug 18 , 2025 | 08:54 AM