Home » Chittoor
శ్రీకాళహస్తీశ్వరస్వామికి శుక్రవారం హైదరాబాద్కు చెందిన ఇందిర రూ.9.32లక్షల విలువైన 96గ్రాముల బంగారు కాసుల దండ, 650గ్రాముల వెండి బిందెను వితరణ చేశారు. వీటిని ఈవో బాపిరెడ్డి స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక నుంచి నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజనులో ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఒకే రెవెన్యూ డివిజన్ కింద ఒకటికి మించి నియోజకవర్గాలు.. ఒకే నియోజకవర్గంలోని మండలాలు కొన్ని ఒక డివిజనులో.. మరికొన్ని ఇంకో డివిజనులో వుండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరులో అక్రమాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మాన్యువల్గా ఉన్న మస్టర్లు ఇకపై ఆన్లైన్ ద్వారా నమోదు కానున్నాయి.
గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలుచేసేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు ‘డివిజన్ డెవల్పమెంట్ ఆఫీస్’ (డీడీవో) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లాకు నాలుగు కార్యాలయాలు కేటాయించగా, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరిలలో ఏర్పాటు చేశారు. నవంబరు 1 నుండి ఈ కార్యాలయాలు పనిచేస్తాయి.
పోక్సో కేసులో అన్నమయ్య జిల్లా యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణ చివరి ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు.
ఒక్క కుటుంబంలోనో, గ్రామంలోనో... ఐఏఎస్, ఐపీస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు... ఐదారుగురు ఉన్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్య పోతాం. ‘వారెంత అదృష్టవంతులో కదా’ అనుకుంటాం. అయితే.. చిత్తూరు జిల్లాలోని ‘కార్వేటినగరం’ మండలానికి వెళితే ఏకంగా వెయ్యి మంది ఉపాధ్యాయులను చూడొచ్చు.
వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పోలీసులపై దౌర్జన్యం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.
నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు ఏ 13 కట్టా సురేంద్ర నాయుడును పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మిగిలిన 9 మందిని వేరువేరుగా ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు.