Share News

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:37 PM

అధికారులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు.. భయపడి బతకొద్దు.. అని ఆయన అన్నారు. వరదయ్యపాలెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు

- అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

వరదయ్యపాళెం(చిత్తూరు): ‘నన్ను కాదని, నాకు తెలియకుండా, ప్రొటోకాల్‌ లేని ఎవరి చేతనో ప్రభుత్వ భవనాలకు భూమిపూజ చేయిస్తారా? మీకు సిగ్గలేదా? మీరు అధికారులా.. పాలేగాళ్లా. ఎవరికోసమో బానిసలుగా పనిచేయొద్దు. భయపడి బతకొద్దు’ అంటూ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆదిమూలం(MLA Adimoolam) ధ్వజమెత్తారు. వరదయ్యపాలెంలో బుధవారం జరిగిన ప్రజాదర్బార్‌లో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.


nani2.jpg

ఇంకోసారి ప్రొటోకాల్‌ విస్మరించి అనధికార వ్యక్తుల చేత ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే హైకోర్టులో పిటిషన్‌ వేస్తానని హెచ్చరించారు. సంతకు వచ్చినట్టు వచ్చే వారు శాశ్వతం కాదని, తాను ఇక్కడే ఉంటానన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్‌ చేపడితే విద్యుత్‌ శాఖ ఏఈ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు గైర్హాజరు కావడం దారుణమన్నారు. వారిపై కలెక్టర్‌, సీఎండీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం

ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 08 , 2026 | 12:37 PM