AP News: చిత్తూరు జీఎస్టీ స్కాంపై అమిత్‌షాకు ఫిర్యాదు
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:36 PM
చిత్తూరు జీఎస్టీ స్కాంపై ఓ యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంభంధిచిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- తననూ మోసం చేశారన్న చిత్తూరు యువకుడు
చిత్తూరు: చిత్తూరులో జీఎస్టీ స్కాంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ స్కాంపై చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amithsha)కు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. 2018లో మదీన స్టీల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేశాడు. 2019 అక్టోబరులో ప్రభుత్వ వైన్ షాపులో ఉద్యోగం రావడంతో మదీనా స్టీల్స్‌లో ఉద్యోగం మానేశాడు.
2025 ఆగస్టులో రూ.92,082 జీఎస్టీ చెల్లించాలని అతడికి నోటీసు వచ్చింది. మళ్లీ అదే నెల ఆగస్టు 23న రూ.41,81,084 లక్షలు చెల్లించాలని జీఎస్టీ నుంచి మరో నోటీసు వచ్చింది. స్ర్కాప్, జీఎస్టీ స్కామ్ గురించి విని గతంలో పనిచేసిన మదీనా స్టీల్స్ యజమాని షేక్ రిజ్వాన్‌ను కలిశాడు. నోటీసుపై నిలదీశాడు. దీనిపై రిజ్వాన్ స్పందించాడు. విజయ్‌చక్రవర్తి పేరుపై వ్యాపారంచేశానని రిజ్వాన్ ఒప్పుకున్నాడు.

సమస్య నుంచి బయట పడేయడానికి తన వద్ద జీఎస్టీ అధికారులు ఉన్నారని చెప్పాడని అందులో విజయ్‌చక్రవర్తి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఆనోటీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించాడు. షేక్ రిజ్వాన్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీసీఎం పవన్‌కళ్యాణ్‌కు,ప్రిన్సి పల్ సెక్రటరీకి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News