Home » Chittoor
TDP Leader: టీడీపీ నేత గార్లపాటి ప్రకాష్ రావు బుధవారం భార్యతో కలిసి షిరిడి యాత్రకు వెళ్లారు. ప్రకాష్ రావు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా లేదు.
నేటినుంచి 28వ తేది వరకు పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందేందుకు పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు ర్యాంకుల వారీగా హాజరు కావాలి.
వైసీపీ అధికారాన్ని కోల్పోయాక కూడా చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ పార్టీ నేతల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుప్పం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు అక్తర్, తన తమ్ముడు అంజాద్‌తో కలిసి అంగన్వాడీ కార్యకర్త నజియా బేగంపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.
Kuppam Incident: అప్పు తీరుస్తామని చెప్పినా వదల్లేదని బాధితురాలు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు.. తనను తీవ్రంగా కొట్టడంతో చెయ్యికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని శిరీష తెలిపారు.
CM Chandrababu: కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసిన వారిని కఠిన శిక్షించాలని ఆదేశించారు.
చేసిన అప్పు భర్త తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు....
Road Accident: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరంతా రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది.
మామిడి రైతులకు న్యాయం చేసేందుకు మద్దతు ధర అమలు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.