Share News

VRO Postings: రూల్స్ పక్కన.. 'మనవాళ్లే' ముందు .. వీఆర్వో పోస్టింగుల్లో రాజకీయాలు

ABN , Publish Date - Aug 14 , 2025 | 09:33 AM

చిత్తూరు జిల్లాలో మదనపల్లె చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడి భూములు విలువైనవే కాదు.. ఇక్కడ భూకబ్జాలు, ఆక్రమణలు, ఫోర్జరీ రికార్డులతో స్వాధీనం చేసుకునే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు ఎక్కువగా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ సిబ్బంది, అధికారులే వీరికి ప్రత్యక్ష, పరోక్షకారులు. ఈ క్రమంలో అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వీరంతా కలసి పనిచేసినవారే.

VRO Postings: రూల్స్ పక్కన.. 'మనవాళ్లే' ముందు .. వీఆర్వో పోస్టింగుల్లో రాజకీయాలు
VRO Postings

» అయిదేళ్లయినా ఒకేచోటే పోస్టింగ్

» సొంత మండలంలోనే ఉద్యోగం

» వీఆర్వో గ్రేడ్-1, గ్రేడ్-2 బదిలీలు అస్తవ్యస్తం

చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన వీఆర్వోల బదిలీల్లో వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహరించారు. ఎప్పుడో మేలో మొదలైన బదిలీల ప్రక్రియ చివరకు మూడు నెలల తర్వాత కార్యరూపం దాల్చినా అది కూడా అస్తవ్యస్తంగా జరిగిందనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి అయిన వారిని అందలమెక్కించారని పలువురు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక ఉద్యోగిని బదిలీ చేయాలంటే ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం, సొంత మండలం, గతంలో పనిచేసిన గ్రామం, తదితర వివరాలతో కూడిన ప్రొఫార్మాలో వివరాలు తీసుకుని ఆ మేరకు పోస్టింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం అవేమీ పట్టించుకోకుండా 'మనోడే' అన్నట్లు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.


మదనపల్లె, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో మదనపల్లె చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడి భూములు విలువైనవే కాదు.. ఇక్కడ భూకబ్జాలు, ఆక్రమణలు, ఫోర్జరీ రికార్డులతో స్వాధీనం చేసుకునే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు ఎక్కువగా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ సిబ్బంది, అధికారులే వీరికి ప్రత్యక్ష, పరోక్షకారులు. ఈ క్రమంలో అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వీరంతా కలసి పనిచేసినవారే. ఇందులో భాగంగా తమకు కావాల్సిన రెవెన్యూ సిబ్బందిని కావాల్సిన గ్రామానికి డిప్యుటేషన్‌పై వేయించుకోవడం, కావాల్సిన ఫైలు, నివేదిక, 22ఏ ఎన్వోసీకి సిద్ధం అయ్యాక తిరిగి వారిని మరో గ్రామానికి మార్పు చేసిన సంఘటనలు ఉన్నాయి.


ముఖ్యంగా బీకే పల్లె, బసినికొండ, వలసపల్లె, కోళ్లబైలు రెవెన్యూ గ్రామాల్లో ఇలాంటివి ఎక్కువగా జరిగాయి. అడ్డదారుల్లో ఎన్వోసీలు కూడా జారీ చేశారు. చివరకు భూ అక్రమాలు, రెవెన్యూ రికార్డులు కనుమరుగు చేసే క్రమంలో సబ్ కలెక్టర్ కార్యాల యంలోని రికార్డుల దహనానికే పాల్పడిన విషయం తెలిసిందే. అయినా రెవెన్యూ అధి కారుల్లో మార్పు కనిపించనట్లుంది. జిల్లాలో గ్రేడ్-1లో 45 మంది వీఆర్వోలు, గ్రేడ్-2లో 34 వీఆర్వోలను ఇటీవల బదిలీ చేశారు. ఇందులో ఎక్కువగా జిల్లా కేంద్రం రాయచోటి, రాజంపేట, మదనపల్లె, తదితర మండలాలు ఉన్నాయి. మదనపల్లె మున్సిపాలిటీ, మండలంలో పనిచేసిన వీఆర్వోలు ప్రవీణ్ కుమార్, బి.మునుస్వామి నాయక్, కళ్యాణిలు గ్రేడ్-2 విభా గానికి సంబధించిన వారు. ఉద్యోగం వచ్చిన అయిదారేళ్ల నుంచి వీరు మదనపల్లె పట్టణం, మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేశారు. తాజా బది లీలలోనూ వీరికి గ్రామాన్ని మార్చారే కానీ.. మండలాన్ని దాటనీయలేదు. అలాగే గ్రేడ్-1 వీఆర్వోలు ఎం.నరేంద్రరెడ్డి, నారాయణతో పాటు మరో ఇద్దరు మహిళా వీఆర్వోలకు సొంత మండలంలోనే పోస్టింగ్ ఇచ్చారు. అలాగే బి.కొత్తకోట మండలంలో పనిచేసిన నరేంద్రను తిరిగి బి.కొత్తకోట వీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు. కురబలకోట మండలం ముదివే డు-1లో పనిచేసిన ప్రతిమను తిరిగి సొంత మండలంలోని ముదివేడు-2 వీఆర్వోగా బదిలీ చేశారు. ఇవి మచ్చుకు మాత్రమే జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.


మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంలో ఎక్కువ ఎన్వోసీలు జారీ అయిన వలసపల్లె, బీకే పల్లె గ్రామంలో గ్రేడ్-2 వీఆర్వో కళ్యాణి, ప్రవీణ్ కుమార్, మునుస్వామినాయక్‌లు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఇక్కడ పనిచేసిన వీఆర్వోలు సీఐడీ విచారణకు కూడా హాజరవుతున్నారు. మరోవైపు ప్రస్తుతం కలికిరి మండలంలో పనిచేస్తున్న గ్రేడ్-1 వీఆర్వో నరేంద్ర రెడ్డిని కోళ్లబైలు రెవెన్యూ గ్రామానికి బదిలీ చేశారు. అలాగే పట్టణంలోని ఎస్బీఐ కాలనీ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న బి.మునుస్వామి నాయనాయక్‌‌ను సొంత మండలమే కాదు.. స్వగ్రామం కోటవారిపల్లెకు బదిలీ చేశారు.


నరేంద్రరెడ్డి, మునుస్వామినాయక్‌లు ఇద్దరూ సొంత ప్రాంతాలు అంటూ జాయిన్ కాలేదని చెబుతున్నారు. అలాగే బి.కొత్తకోట నుంచి గ్రేడ్-1 వీఆర్వో జె.మల్లికార్జున కూడా కోళ్లబైలుకు బదిలీ చేశారు. అయితే ఆయన కూడా కోళ్లబైలులో చేరడానికి నిరాకరిస్తున్నారు. బొమ్మనచెరువులో వీఆర్వోగా పనిచేస్తున్న సౌజన్యను కోళ్లబైలు గ్రామానికి డిప్యుటేషన్ వేశారు. అయితే కోళ్లబైలుకు ఎవరూ రాని కారణంగా ఆమెను రిలీవ్ చేయలేదు. ఈమె స్థానంలో బొమ్మనచెరువులో కొత్తవారిపల్లె-2 వీఆర్వో వసంతకుమారి ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. అలాగే అంకిశెట్టిపల్లె వీఆర్వో సంధ్యను ఇదివరకే పొన్నేటి పాళెం గ్రామానికి ఇన్‌చార్జ్‌గా నియమించగా, ప్రస్తుతం బదిలీల్లోనూ అక్కడికే రెగ్యూలర్ పోస్టింగ్ ఇచ్చారు.


సొంత మండలం ఎవరికీ ఇవ్వలేదు -మధుసూదన్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి

వీఆర్వోల బదిలీల్లో సొంత మండలాల్లో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. అలాంటివి ఏమైనా ఉంటే మీరే చెప్పండి. చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఉన్నవాళ్లు అలాగే ఉంటారు. కొత్తగా బదిలీ చేసే వాళ్లకు మాత్రమే సొంత మండలం వర్తిస్తుంది. బదిలీ చేసిన అందరినీ రిలీవ్ చేయమని తహసీల్దార్లకు చెప్పాం. అలా ఎక్కడైనా చేయకుండా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం.

బదిలీలతో నాకు సంబంధం లేదు - కిశోర్ కుమార్‌రెడ్డి, తహసీల్దార్, మదనపల్లె,

వీఆర్వోల బదిలీలు, పోస్టింగుల్లో నాకు సంబంధం లేదు. అదంతా కలెక్టర్ ఆదేశాలు. అడిగిన వారిని రిలీవ్ చేశాం. రిలీవ్ నా సొంత అజెండా అంటూ ఏమీ లేదు. పై అధికారులు ఆపమంటే ఆపాం. మళ్లీ వాటిల్లో మార్పులు ఉన్నాయని చెప్పారు. మార్పులు, చేర్పులు దగ్గరలోనే జరగొచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది

జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 09:44 AM