AP NEWS: చిత్తూరు జిల్లాలో అద్భుతం.. నుదుటిపై మూడు నామాలతో ఆవుదూడ జననం
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:24 AM
సుదుటిపై మూడు నామాలతో జన్మించిన ఆవుదూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు (యల్లంపల్లె) చెందిన రవినాయుడు సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు.
చౌడేపల్లె, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సుదుటిపై మూడు నామాలతో జన్మించిన ఆవుదూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు (యల్లంపల్లె) చెందిన రవినాయుడుకి సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు. ఆవులకు వ్యాధి నయమైనా పనుల వత్తిడిలో మొక్కు వాయిదా వేస్తూ వచ్చాడు. రెండు రోజుల క్రితం ఓ ఆవు ఒక పేయదూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు నుదుటిపై తెల్లరంగులో మూడు నామాలుండటం చూసి స్వామి మొక్కును గుర్తు చేస్తున్నారని రవినాయుడికి అన్పించింది. దీంతో గతంలో గోశాలకు ఇద్దామనుకున్న దూడతో పాటు నామాలతో పుట్టిన దూడను కూడా టీటీడీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్
గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా
For More AndhraPradesh News And Telugu News