Share News

Left Handers Day: ఎడమచేతి వాడకం లోపం కాదు.. ప్రత్యేకతలు ఇవే..

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:02 AM

ఎడమచేతి వాటం కలిగిన వారిని ఒకప్పుడు పుర్రచెయ్యోడు లొడ్డోడు.. అని ఎగతాళి చేసేవారు. ఎడమచేతిని వాడటం ఏ రకంగానూ లోపం కాదు అయినా ఇప్పటికీ కుటుంబాల్లో కూడా ఎంతో కొంత గాయపడే మాటలు విసురుతూనే ఉంటారు. బలవంతంగా కుడి చేతిని వాడాలని వేధిస్తుంటారు.

Left Handers Day: ఎడమచేతి వాడకం లోపం కాదు.. ప్రత్యేకతలు ఇవే..
Left Handers Day

తిరుపతి ఆంధ్రజ్యోతి: ఎడమచేతి వాటం (Left Handers) కలిగిన వారిని ఒకప్పుడు పుర్రచెయ్యోడు లొడ్డోడు.. అని ఎగతాళి చేసేవారు. ఎడమచేతిని వాడటం ఏ రకంగానూ లోపం కాదు అయినా ఇప్పటికీ కుటుంబాల్లో కూడా ఎంతో కొంత గాయపడే మాటలు విసురుతూనే ఉంటారు. బలవంతంగా కుడి చేతిని వాడాలని వేధిస్తుంటారు. ఆడా, మగా సమానం అన్నట్లే... కుడి, ఏడమల్లోనూ తేడా లేదు. ఒకటి బలమైనది. మరొకటి బలహీనమైనది కానేకాదు. ఏది ఎక్కువగా వాడితే అది ఆ పనులకు అలవాటవుతుంది అంతే. ప్రపంచంలో ప్రతి పదిమందిలో ఒకరు ఎడమ చేతివాటం వారని అంచనా. ఎడమచేతి వివక్షను సమాజంలో పోగొట్టాలనే ఉద్దేశంతో నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే (Left Handers Day) జరుపుకుంటున్నారు.


లెఫ్ట్ హ్యాండర్స్ అనుకూలతలు

» బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిలో కుడిచేతి వారికంటే త్వరగా ఎడమచేతివారు కోలుకుంటారు.

» క్రీడాకారులకు ప్రయోజనం ఎక్కువ

» టైపింగ్లోనూ వేగం,

» మెదడులోని ఎడమ, కుడి భాగాలతో మెరుగైన అనుసంధానం

» పార్కిన్‌సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ.

» నీటిలోపల చూసే సామర్థ్యం ఎక్కువ.


సర్జరీల్లోనూ సమస్య లేదు: డాక్టర్ పద్మజ అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి

చిన్నతనం నుంచి నాకు ఎడమ చేతివాటమే. ఎక్కడా ఇబ్బంది రాలేదు. యాదృచ్చికమే అయినా నా భర్త డాక్టర్ హరిబాబుది కూడా ఎడమ చేతివాటమే. ఆయన చిత్తూరు అపోలో హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. సర్జరీల్లో మాకు ఎప్పుడూ ఏ సమస్యా కాలేదు. ఏ తేడా అనిపించలేదు.


ఎడమచేతిని అడ్డుకోవద్దు భాస్కర రాజు, మేక్మబేబీ జీనియస్ స్కూల్ వ్యవస్థాపకుడు

కుడి చేత్తో రాయడం వల్ల మెదడులోని ఎడమ అర్ధగోళం (భాష లాజిక్ పనిచేసే ప్రదేశం) పని చేస్తుంది. ఎడమ చేత్తో రాయడం వల్ల కుడి అర్ధగోళం (సృజనాత్మకత, స్పేన్ అవగాహన గల ప్రదేశం) పని చేస్తుంది. అదే రెండింటినీ ఉపయోగించడం వల్ల కార్నస్ కాలానమ్ (రెండు అర్ధగోళాలను కలిపే సేతు) బలపడుతుంది. చేతుల కదలికలను నియంత్రించే మెదడు భాగం కొత్త కదలికలను నేర్చుకుంటుంది, ఈకొత్త న్యూరల్ కనెక్‌న్లు కొత్త పనికి అలవాటు పడే క్రమంలో కొత్త విషయాలను వేగంగా నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. రెండు చేతుల సమన్వయం మెరుగపుతుంది టైపింగ్ సంగీత వాయిద్యాలు వాయించడం, అటల్లో చురుకుదనం, వేగం పెరుగుతాయి. పిల్లలు ఎడమ చేయి వాడుతుంటే అడ్డుకోవద్దు. వీలైతే రెండు. చేతులూ వాడేలా ప్రోత్సహించండి.


కుడి, ఎడమ తేడా లేదని నిరూపిస్తున్నా.. సవ్యసాచి అశ్విని

కుడి, ఎడమ తేడా లేదని నిరూపిస్తున్నారు సంగరాజు అశ్వని, రెండు చేతులతోనూ ఆమె ఒక వేగంతో రాయగలరు. ఇంకా విశేషం ఏమిటంటే ఒకేసారి కుడిచేత్తో ఒక భాష, ఎడమ చేత్తో మరో భాషలో రాయడం అక్షరాల అందంలోనూ కుడిచేతికి, ఎడమ చేతికి తేడా ఉండదు. ప్రస్తుతం తిరుపతిలోని మేక్‌మై బేబీ జీనియన్ స్కూల్ డైరెక్టర్‌గా ఉన్న అశ్విని ఎడమచేతిని వాడే తమ విద్యార్థుల్లో న్యూనతను పోగొట్టడానికి తాను రాసి చూపిస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్‌

గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 11:03 AM