ABN Andhrajyothy: ‘ఆంధ్రజ్యోతి' ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:47 AM
ప్రపంచ ఫొటోగ్రఫీ డేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీపీజేఏ) నిర్వహంచిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో తిరుపతి ఆంధ్రజ్యోతి స్టాప్ ఫొటోగ్రాఫర్లు ఆర్ లావణ్య కుమార్, కె.సాయికుమార్‌లకు బహుమతులు లభించాయి.
తిరుపతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఫొటోగ్రఫీ డేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీపీజేఏ) నిర్వహంచిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో తిరుపతి ఆంధ్రజ్యోతి స్టాప్ ఫొటోగ్రాఫర్లు (ABN Andhrajyothy Photo Journalists) ఆర్ లావణ్య కుమార్, కె.సాయికుమార్‌లకు బహుమతులు లభించాయి.
స్పాట్‌న్యూస్ ఫొటో విభాగంలో లావణ్యకుమార్ తీసిన కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను తొలగిస్తున్న పారిశుధ్య కార్మికుల ఫొటోకు అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. జనరల్ విభాగంలో తిరుమల నడకదారిలో ఐసు తింటున్న ఉడుత ఫొటో తీసిన సాయికుమార్‌కు అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు. ఆగస్టు 18న విజయవాడలో జరగనున్న వేడుకలో వారు ఈ అవార్డులు అందుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్
గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా
For More AndhraPradesh News And Telugu News