Roads: పల్లె రోడ్ల అభివృద్ధి
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:34 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి రూ.222 కోట్లతో మరమ్మతులు, అభివృద్ధి చేయగా..తాజాగా మరిన్ని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి రూ.38.25 కోట్లను విడుదల చేసింది.
చిత్తూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో నిర్వహణ కూడా కరువై ఛిద్రమైపోయిన పల్లె రహదారులకు మంచికాలం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి రూ.222 కోట్లతో మరమ్మతులు, అభివృద్ధి చేయగా..తాజాగా మరిన్ని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి రూ.38.25 కోట్లను విడుదల చేసింది. నాబార్డు, స్టేట్ గవర్నమెంటు ఫండ్స్‌తో మంజూరైన ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి.
రూ.18.95 కోట్ల నాబార్డు నిధులతో..
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రూ.18.95 కోట్ల నాబార్డు నిధులతో 64 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. కుప్పంలో 3, పలమనేరులో 2, చిత్తూరు, జీడీనెల్లూరు, నగరి, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున పనులు మంజూరయ్యాయి.ఫచిత్తూరు- తిరుత్తణి రోడ్డు నుంచి చిత్తూరు- వేలూరు రోడ్డు వయా చీలాపల్లె 11.72 కి.మీ- రూ.2 కోట్లు (చిత్తూరు నియోజకవర్గం)ఫ-కుప్పం- సంగనపల్లె రోడ్డు నుంచి అలుగుమానిపల్లె రోడ్డు 3 కి.మీ- రూ.70 లక్షలు (కుప్పం నియోజకవర్గం)ఫఅడవిబూదుగూరు క్రాస్ నుంచి తమిళనాడు బార్డర్ 4.73 కి.మీ- రూ.1.20 కోట్లు (కుప్పం నియోజకవర్గం)ఫకుప్పం- పొగురుపల్లె రోడ్డు నుంచి గుడుపల్లె రోడ్డు 3 కి.మీ- రూ.70 లక్షలు (కుప్పం నియోజకవర్గం)ఫ రాయలపేట నుంచి మాధవరం రోడ్డు 9.80 కి.మీ- రూ.2.20 కోట్లు (పలమనేరు నియోజకవర్గం)ఫకల్లుపల్లె నుంచి చౌడేపల్లె రోడ్డు 1 కి.మీ- రూ.4.45 కోట్లు (పలమనేరు నియోజకవర్గం)ఫచిత్తూరు- పుత్తూరు రోడ్డు నుంచి కమ్మకండ్రిగ రోడ్డు వయా పుల్లూరు రోడ్డు 10.4 కి.మీ- రూ.2 కోట్లు (జీడీనెల్లూరు నియోజకవర్గం)ఫసీకేటీ రోడ్డు నుంచి పాకాల- దామలచెరువు రోడ్డు వయా అయ్యప్పగారిపల్లె రోడ్డు 9.30 కి.మీ- 2.20 కోట్లు (పూతలపట్టు నియోజకవర్గం)ఫఏపీ రోడ్డు నుంచి ఎంసీఆర్ రోడ్డు వయా ఆరంట్లపల్లె 3.90 కి.మీ- రూ.1.50 కోట్లు (పుంగనూరు నియోజకవర్గం)ఫ నగరి ఆర్‌ఎస్ నుంచి వెంగన్నకండ్రిగ వయా ముడిపల్లె రోడ్డు 7.60 కి.మీ - రూ.2 కోట్లు(నగరి నియోజకవర్గం).
రూ.19.40 కోట్ల రాష్ట్రప్రభుత్వ నిధులతో..
రూ.19.40 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 46 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 2 చొప్పున, చిత్తూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున పనులు మంజూరయ్యాయి.ఫగోవిందపల్లె, దండికుప్పం రోడ్డు నుంచి శివరామపురం వరకు రూ.2.10 కోట్లతో 7.2 కి.మీ ఫ కంచనబల్ల- రామకుప్పం, వీర్నమల రోడ్డు వరకు రూ.2.40 కోట్లతో 9.9 కి.మీ ఫ ఎంసీబీ రోడ్డు నుంచి నలగాంపల్లె, కేబీఎన్ కండిగ్ర, తంబుగానిపల్లె, మంగళంపల్లె, 65 వెంకటాపురం, బండివాండ్లవూరు రోడ్డు రూ.1.80 కోట్లతో 5.9 కి.మీఫ పుంగనూరు- శంకర్రాయలపేట క్రాస్ రోడ్డు నుంచి బైరెడ్డిపల్లె రోడ్డు వరకు రూ.4.50 కోట్లతో 6.3 కి.మీఫ పలమనేరు నుంచి గుడియాత్తం రోడ్డు వరకు రూ.1.80 కోట్లతో 3 కి.మీ ఫ నగరి నుంచి నాగలాపురం రోడ్డు వరకు రూ.4.30 కోట్లతో 8.60 కి.మీ ఫ చిత్తూరు నుంచి గుడియాత్తం రోడ్డు రూ.2.50 కోట్లతో 5 కి.మీ
ఇప్పటికే రూ.222 కోట్ల కేటాయింపు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాలోని రహదారుల అభివృద్ధి, మరమ్మతుల కోసం పలు విడతల్లో రూ.222 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.22 కోట్లతో రహదారుల్ని మరమ్మతు (ప్యాచ్ వర్కులు) చేసింది. రూ.6 కోట్లతో చిత్తూరు- గుడియాత్తం రోడ్డు, రూ.2.35 కోట్లతో చిత్తూరు- గుడిపాల రోడ్లను అభివృద్ధి చేసింది.ఉపాధి హామీ నిధుల్లోంచి రూ.90 కోట్లతో సీసీ రోడ్లు, రూ.30 కోట్లతో బీటీ రోడ్లు పూర్తి చేసింది. రూ.4 కోట్లతో చిత్తూరు ఫారెస్టు రోడ్డును అభివృద్ధి చేసింది. రూ.15 కోట్ల ఉపాధి గ్రాంట్లతో పీఆర్ రోడ్లకు టెండర్లు పిలిచారు. రూ.53 కోట్ల ప్రత్యేక నిధులతో కుప్పం నియోజకవర్గంలో 23 రహదారుల అభివృద్ధి చేపట్టగా.. ఇప్పటికే 13 పనులు పూర్తయ్యాయి. వీటికి తాజాగా విడుదలైన రూ.38.35 కోట్లు అదనం.