Home » China
ఇరాన్‌కు తాము ఆయుధాలు పంపడం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు. ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న వార్తలు కొద్ది రోజులుగా వెలువడుతున్న సంగతి తెలిసిందే.
అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ చైనా నౌక ఒకటి హోర్ముజ్‌ను దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ట్రంప్ కారణంగానే హోర్ముజ్ జలసంధికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చైనా వ్యాఖ్యానించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ దిగ్బంధన హెచ్చరికలతో అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా అడ్డంకులు లేని మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతుండటాన్ని భారత్ ఖండించింది. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాచల్ చైనాది అయిపోదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.
గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్‌లో యుద్ధం నేపథ్యంలో చైనా కంపెనీలు ఏఐ సాయంతో అమెరికా సైన్యం కదలికలపై నిఘా పెడుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చైనా ప్రభుత్వమే ఈ కంపెనీలను ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
చైనాలో తాజాగా వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దెయ్యాల కథలను వినిపిస్తూ పక్కింటి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నారు. చివరకు స్థానిక న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్ పయనీర్‌కు చెందిన ఓ రాకెట్ నింగిలోకి లేచిన కొన్ని క్షణాలకే పేలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇరాన్ ముడి చమురుతో భారత్‌కు రావాల్సిన ఒక ఆయిల్ ట్యాంకర్ తన గమ్యాన్ని చైనాకు మార్చుకున్నట్టు షిప్ ట్రాకింగ్ వెబ్‌సైట్ కెప్లర్ తాజాగా పేర్కొంది. ఇందుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.