Share News

Trump China tariff: టార్గెట్ చైనా.. డ్రాగన్ దేశంపై వంద శాతం సుంకాలు విధించిన ట్రంప్..

ABN , Publish Date - Oct 11 , 2025 | 08:43 AM

మొన్నటివరకు సుంకాల పేరుతో భారత్‌పై వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాను కూడా టార్గెట్ చేసుకున్నారు. తాజాగా మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

Trump China tariff: టార్గెట్ చైనా.. డ్రాగన్ దేశంపై వంద శాతం సుంకాలు విధించిన ట్రంప్..
Trump China tariff

మొన్నటివరకు సుంకాల పేరుతో భారత్‌పై వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాను కూడా టార్గెట్ చేసుకున్నారు. తాజాగా మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ టారిఫ్‌లు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే చైనాపై 30 శాతం పన్నులు అమల్లో ఉన్న విషయం తెలిసిందే (Trump 100% tariff on china).


అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడం ట్రంప్ ఆగ్రహానికి కారణం (US-China trade war). అందుకు ప్రతిగానే చైనాపై టారిఫ్ వార్‌కు తెర తీశారు. అక్టోబర్ చివర్లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి చర్చలు జరపాలని ట్రంప్ భావించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, జిన్‌పింగ్‌తో చర్చలు చేయడంలో అర్థం లేదని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా టారిఫ్‌లపై చైనా ఇంకా స్పందించలేదు. ఈ టారిఫ్‌లకు ప్రతిగా చైనా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ఈ నెల నుంచి టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు.


'చైనాలో విచిత్రమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి (Trump vs China). అరుదైన ఖనిజాలపై పలు ఆంక్షలు విధించాలనుకుంటున్నారు. దీనిపై ప్రపంచం మొత్తానికి లేఖలు పంపుతున్నారు. చైనా నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. చైనాతో మేం కొంతకాలంగా మంచి సంబంధాలే కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ వారి తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ దేశం ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించాలని నిర్ణయించాం. చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాన్ని విధిస్తున్నాం. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయి' అని ట్రంప్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరియా కొరినాను వరించిన నోబెల్ శాంతి బహుమతి

మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్

Read Latest International News and Telugu News

Updated Date - Oct 11 , 2025 | 08:43 AM