Share News

woman eats frogs: వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి 8 కప్పలను మింగింది.. తర్వాతేం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:14 PM

వైద్య పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా కొందరు పాత కాలం పద్ధతులను, మూఢ నమ్మకాలను ఫాలో అవుతుంటారు. లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా ఓ చైనా మహిళ ఓ విచిత్రమైన నమ్మకాన్ని ఫాలో అయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

woman eats frogs: వెన్ను నొప్పి తగ్గించుకోవడానికి 8 కప్పలను మింగింది.. తర్వాతేం జరిగిందంటే..
strange medical treatment

వైద్య పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా కొందరు పాత కాలం పద్ధతులను, మూఢ నమ్మకాలను ఫాలో అవుతుంటారు. లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా ఓ చైనా మహిళ ఓ విచిత్రమైన నమ్మకాన్ని ఫాలో అయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. రెండు వారాలు హాస్పిటల్‌లో చికిత్స పొంది కోలుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (back pain cure).


చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన జాంగ్ అనే మహిళ కొంతకాలంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతోంది (bizarre remedy). వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే బతికి ఉన్న ఎనిమిది కప్పలను మింగాలని ఎవరో చెప్పింది విని పాటించింది. దీంతో ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. లోపలికి చేరిన కప్పలు ఆమె జీర్ణవ్యవస్థను నాశనం చేశాయి. అంతేకాకుండా కప్పల ద్వారా కడుపులోకి చేరిన స్పార్గనమ్ వంటి పరాన్నజీవులు ఆమె శరీరం మొత్తాన్ని ఆక్రమించాయి.


పరిస్థితి అదుపు తప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హాంగ్‌జౌలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పరిస్థితి తెలుసుకున్నారు (frog therapy). పూర్తిగా దెబ్బతిన్న ఆమె జీర్ణవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టారు. దాదాపు రెండు వారాల పాటు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. చివరకు ఆరోగ్యం కుదుటపడడంతో రెండు వారాల అనంతరం ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది.


ఇవి కూడా చదవండి..

ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..

ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2025 | 12:14 PM