Battery Fire On Flight: బ్యాటరీ ఎంత పని చేసింది.. దెబ్బకు ప్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్..
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:23 PM
విమానం క్యాబిన్‌లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో లిథియమ్ బ్యాటరీ పేలింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఇది గుర్తించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న విమానాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. తాజాగా, ఓ బ్యాటరీ కారణంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. బ్యాటరీ పేలి విమానంలో మంటలు చెలరేగటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాకు చెందిన ఎయిర్ చైనా విమానం సీఎ139 శుక్రవారం హాంగ్‌చౌ నుంచి సియోల్ బయలు దేరింది. ఈ నేపథ్యంలోనే విమానం క్యాబిన్‌లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో లిథియమ్ బ్యాటరీ పేలింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఇది గుర్తించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటల్ని ఆర్పారు. ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని విమానం షాంగైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
ఈ ప్రమాదంలో ప్రయాణికులెవ్వరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు ఉన్నాయి. విమానంలోని ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే విమాన సిబ్బంది అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి
తానా బోర్డు అఫ్ డైరెక్టర్ సాహస యాత్ర.. విశ్వగురుకులం సిద్ధాంతంతో..
2 ఏళ్లుగా జీతాల్లేవ్.. తీవ్ర మనోవేదనకు గురై..