Share News

Businesswoman Gives Rs 3 Crore: శుభలగ్నం సినిమా రిపీట్.. ట్విస్ట్ మామూలుగా ఉండదు..

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:47 AM

భార్యతో విడాకులు తీసుకోమని ఆ యువకుడికి కూడా చెప్పింది. అతడు సరేనన్నాడు. భరణం కింద అతడి భార్య చెన్ 3 కోట్లు డిమాండ్ చేసింది. ఈ డబ్బుల్ని ఝూ సమకూర్చింది.

Businesswoman Gives Rs 3 Crore: శుభలగ్నం సినిమా రిపీట్.. ట్విస్ట్ మామూలుగా ఉండదు..
Businesswoman Gives Rs 3 Crore

శుభలగ్నం సినిమాలో రోజా తన కంపెనీలో పని చేసే జగపతిబాబును ఇష్టపడుతుంది. పెళ్లికూడా చేసుకోవాలని అనుకుంటుంది. అయితే, అతడికి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉంటారు. అయినా కూడా రోజాకు జగపతిబాబు మీద ప్రేమ చావదు. డబ్బు ఆశ ఉన్న జగపతి బాబు భార్య ఆమనితో ఓ డీల్ చేసుకుంటుంది. కోటి రూపాయలు ఇచ్చి జగపతి బాబును కొనుక్కుంటుంది. తర్వాత అతడ్ని పెళ్లి చేసుకుంది. అయితే, గర్భం దాల్చిన తర్వాత రోజా విదేశాలకు వెళ్లిపోతుంది. జగపతి బాబును ఆమనికే తిరిగి ఇచ్చేస్తుంది. ఇది సినిమా కథ. నిజ జీవితంలోనూ అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.


చైనాలోని చాంగ్వింగ్‌కు చెందిన ఝూ అనే మహిళ ఓ కంపెనీ నిర్వహిస్తోంది. ఆ కంపెనీలో పని చేసే ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. అయితే, అప్పటికే ఇద్దరికీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఝూ తన భర్తకు విడాకులు ఇచ్చింది. భార్యతో విడాకులు తీసుకోమని ఆ యువకుడికి కూడా చెప్పింది. అతడు సరేనన్నాడు. భరణం కింద అతడి భార్య చెన్ 3 కోట్లు డిమాండ్ చేసింది. ఈ డబ్బుల్ని ఝూ సమకూర్చింది. దగ్గరుండి భార్యాభర్తలకు విడాకులు ఇప్పించింది. తర్వాత ఝూ, ఆ యువకుడు సహజీవనం చేయటం మొదలెట్టారు.


వీరి సహజీవనం ఎక్కువ కాలం సాగలేదు. తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. సంవత్సరంలోనే తమ బంధంపై ఓ క్లారిటీ తెచ్చుకున్నారు. కలిసి బతకటం సాధ్య పడదని నిర్ణయించుకుని విడిపోయారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రియుడికి విడాకులు ఇప్పించడానికి ఇచ్చిన మూడు కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలని ఝూ అడిగింది. అయితే, ఆ యువకుడు కానీ, అతడి మాజీ భార్య కానీ ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఝూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఝూకు మద్దతుగా తీర్పునిచ్చింది.


ఆ యువకుడు పైకోర్టును ఆశ్రయించాడు. పైకోర్టు ఆ యువకుడికి మద్దతుగా తీర్పునిచ్చింది. ఝూ ఆ యువకుడి భార్యకు గిఫ్ట్‌గా డబ్బులు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ‘ఆ యువకుడు అతడి భార్య, బిడ్డ పోషణ కోసం డబ్బు ఇచ్చాడు. ఆర్థికసాయం చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వమని అడగటం న్యాయం కాదు’ అని పేర్కొంది. మొత్తానికి కోర్టు తీర్పుతో ఆ యువకుడు, అతడి మాజీ భార్యకు కేసు నుంచి విముక్తి లభించింది.


ఇవి కూడా చదవండ

భూపతి ఆడియో, వీడియోలపై మావోయిస్టు కేంద్రకమిటీ ఆగ్రహం

టెక్సాస్‌లో హనుమాన్‌ విగ్రహ ఏర్పాటుపై సెనేటర్ తీవ్ర వ్యాఖ్యలు..

Updated Date - Sep 23 , 2025 | 11:53 AM