Maoists Condemn Bhupatis Remarks: భూపతి ఆడియో, వీడియోలపై మావోయిస్టు కేంద్రకమిటీ ఆగ్రహం
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:46 AM
భూపతి ఆడియో, వీడియోలపై మావోయిస్టు కేంద్రకమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లోజుల వేణుపై మండిపడింది.
కాల్పుల విరమణ, శాంతి చర్చలపై భూపతి చేసిన ప్రకటనను మావోయిస్టులు తీవ్రంగా ఖండించారు. భూపతి ఆడియో, వీడియోలపై మావోయిస్టు కేంద్రకమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లోజుల వేణుపై మండిపడింది. వేణుగోపాల్ లొంగిపోయేందుకే ఆరోపణలు చేస్తున్నారని మావోయిస్టు కేంద్రకమిటీ అంది. భూపతి దగ్గర ఉన్న ఆయుధాలు పార్టీకి అప్పజెప్పాలని హెచ్చరించింది. కాగా, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తమ్ముడే భూపతి. ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతకు భూపతి మరిది అవుతాడు.
కేంద్ర కమిటీకి దెబ్బ మీద దెబ్బ
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో సోమవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ(సీసీ) సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతిచెందారు. వీరిద్దరిదీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా. వీరిద్దరిపై 40 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉంది. ఘటనాస్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి
టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహ ఏర్పాటుపై సెనేటర్ తీవ్ర వ్యాఖ్యలు..
భోజనం చేసిన వెంటనే ఈ పనులు అసలు చేయకండి.. ఎందుకంటే..